'దళిత బంధు లబ్ధిదారులెంతమంది..?' ఒకే వేదికపై రెండు వేర్వేరు ప్రకటనలు చేసిన ప్రభుత్వం

by Disha Web Desk 13 |
దళిత బంధు లబ్ధిదారులెంతమంది..? ఒకే వేదికపై రెండు వేర్వేరు ప్రకటనలు చేసిన ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో దళితబంధు లబ్దిదారులు ఎందరో ప్రభుత్వానికే తెలియడం లేదు. ఎంతమందికి ఇస్తున్నారో తెలియదు. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు నిజమే భావన కలుగుతోంది. దళితబంధును లెక్కల్లోనే ప్రభుత్వం చూపుతుందని, దరఖాస్తులన్ని పెండింగ్‌లోనే ఉన్నాయని.. కేవలం రాజకీయాల కోసమే ప్రభుత్వం పథకాన్ని వాడుకుంటుందని ఆరోపిస్తున్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో మంత్రి చెప్పిన లెక్కలు, సీఎం చెప్పిన లెక్కలు పొంతన లేదు.

సభావేదికపై ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. 38 వేల 323 ఎస్సీ కుటుంబాలకు దళితబంధు పథకం ద్వారా లబ్దిపొందారని, ఇందు కోసం 3 వేల 832 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అదే వేధికపై నుంచి 50వేల మందికి దళితబంధు ఇచ్చామని ప్రకటించారు. మంత్రి, సీఎం ఇద్దరి మధ్య వ్యాఖ్యలకు పొంతలేకుండా ఉంది. ఇద్దరు అధికారపార్టీకి చెందినవారే అయినప్పటికీ లెక్కల్లో గ్యాప్ ఉందని స్పష్టమవుతోంది. 11677మంది లబ్దిదారులను ఎక్కువగా చూపడంతో సభకు వచ్చినవారు ఆశ్చర్యానికి గురయ్యారు. లెక్కల్లో తప్పుగా పేర్కొనడంతో మండిపడుతున్నారు.


Next Story

Most Viewed