బాండ్ల ద్వారా వచ్చిన నిధులు పట్టణాభివృద్ధికి..

by Naga Rani Yarlagadda |

హౌజింగ్ అండ్ అర్బన్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 54ఈసీ (ప్రస్తుతం సెక్షన్ 85) క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ బాండ్లపై అసోసియేట్స్ మీట్ నిర్వహించారు.

బాండ్ల ద్వారా వచ్చిన నిధులు పట్టణాభివృద్ధికి..
X
  • హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కులశ్రేష్ట
  • హైదరాబాద్‌లో హడ్కో 54ఈసీ ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సమావేశం

దిశ, తెలంగాణ బ్యూరో: హౌజింగ్ అండ్ అర్బన్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 54ఈసీ (ప్రస్తుతం సెక్షన్ 85) క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ బాండ్లపై అసోసియేట్స్ మీట్ నిర్వహించారు. మే 8న తాజ్ డెక్కన్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చార్టర్డ్ అకౌంటెంట్లు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లు, బ్రోకింగ్ హౌస్ ప్రతినిధులు, బ్యాంకులు, పెట్టుబడి భాగస్వాములు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషన్ తర్వాత హడ్కో చేపట్టిన ఈ బాండ్లకు విశేష స్పందన లభించిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కులశ్రేష్ట మాట్లాడుతూ.. ఈ బాండ్ల ద్వారా సమీకరించే నిధులను పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు వినియోగిస్తామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 85 ప్రకారం, భూమి లేదా భవనాల విక్రయం ద్వారా వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలను ఆరు నెలల్లోపు ఈ బాండ్లలో పెట్టుబడి పెడితే గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ బాండ్ల కాలపరిమితి ఐదేళ్లు ఉంటుందన్నారు. గతేడాది మే 7న ప్రారంభించిన తొలి 54ఈసీ బాండ్ సిరీస్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభించిందని, ఇది సంస్థపై పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా హడ్కో ఇటీవల ప్రారంభించిన అర్బన్ ఇన్వెస్ట్ విండో గురించి వివరించారు. దేశవ్యాప్తంగా స్థిరమైన పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అర్బన్ చాలెంజింగ్ ఫండ్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో హడ్కో డైరెక్టర్ (ఫైనాన్స్) దాల్జీత్ సింగ్ ఖత్రీ, హైదరాబాద్ రీజినల్ చీఫ్ సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story