TNGO అధ్యక్షుడ్ని సత్కరించిన తెలంగాణ హోంమంత్రి

by Disha Web Desk 2 |
TNGO అధ్యక్షుడ్ని సత్కరించిన తెలంగాణ హోంమంత్రి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు పోషించిన పాత్ర మరువలేనిదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు ఫ్రాగ్నిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భందా టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీకి హోంమంత్రి సేవా భూషణ్ అవార్డును బహుకరించారు. అనంతరం మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ముజీబ్ హుసేనీ పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతూనే సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రాగ్నిక ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ.. తాము డాక్టర్ ముజీబ్ హుసేనీ నిస్వార్ధ సేవలను చాలా దగ్గరినుంచి గమనించామని, ఆయనకు బిరుదును ప్రధానం చేయడము తమకు గర్వకారణమని అన్నారు. అవార్డు గ్రహీత ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాట సమయములో సునీత ఆత్మహుతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఫ్రాగ్నిక ఫౌండేషన్ తనను గౌరవించి అవార్డును ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. జిల్లా కార్యదర్శి విక్రమ్ కుమార్, కేఆర్ రాజ్ కుమార్, శ్రీనివాస్, నరేష్, సభ్యులు శంకర్, వైదిక్, సుజాత, ముజీబ్, జహంగీర్ అలీ, వహీద్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed