కాంగ్రెస్‌కు గుడ్ న్యూస్.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో జాతీయ పార్టీ మద్దతు

by GSrikanth |
కాంగ్రెస్‌కు గుడ్ న్యూస్.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో జాతీయ పార్టీ మద్దతు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో ముగియడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను సైతం ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ(ఎం) పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం అధికారిక ప్రకటన చేశారు. ‘‘నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని సీపీఐ(ఎం) నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చాము. అదే విధంగా ఇప్పుడు కూడా బీజేపీని ఓడించడం కోసం ఇండియా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నది. పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని, బీజేపీని ఓడించాలని విజ్ఞప్తి’’ లేఖలో తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.




Next Story