సాగర్ BRSలో అసమ్మతి గళం.. స్పీడ్ పెంచిన కాంగ్రెస్

by Disha Web Desk 4 |
సాగర్ BRSలో అసమ్మతి గళం.. స్పీడ్ పెంచిన కాంగ్రెస్
X

దిశ, తిరుమలగిరి (సాగర్) : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అనంతరం రాజకీయ వేడి రోజు రోజుకు వేడెక్కుతుంది. దీంతో సాగర్ గులాబీలో గుబులు మొదలైంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గులాబీ పువ్వుకు రేకులు ఒక్కొక్కటిగా రాలుతున్నాయి. నియోజకవర్గంలో మంచి పట్టు మీద ఉన్న గులాబీకి ఈసారి పరాభవం తప్పదని అంతటా చర్చ సాగుతుంది. ముందస్తు ప్రణాళిక సఫలం కావడంతో ఇప్పటికే కాంగ్రెస్ మంచి జోష్ మీద కనిపిస్తుంది. ఆరు మండలాలపై గులాబీ పట్టు సడలుతున్నట్టు కనిపిస్తుంది. ఇదే అదునుగా అంది వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటుంది. గులాబీ తోటకు ఇప్పటికే చిల్లు పడింది. పార్టీలోనే కొందరు కీలక నేతలు పార్టీని వీడారు. బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలతో ఇప్పటికే వార్తల్లో పలుమార్లు నిలిచిన బీఆర్ఎస్ కార్యకర్తలను బుజ్జగించే వారే కరువయ్యారు.

దీంతో అసమ్మతితో ఉన్న నాయకులు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పలు ఆరోపణలు చేస్తూ బాహటంగానే బయటికి వస్తున్నారు. నియోజకవర్గంలో మొదట యాదవ సామాజిక వర్గంలో తిరుగుబాటు మొదలు కాగా.. అది కాస్త బీసీ ఓటు బ్యాంకుకు చిల్లుపడే విధంగా తయారైంది. ఒకవైపు రాష్ట్ర గులాబీ దళం నాయకుడిని వెనకేసుకొస్తూనే.. మరోవైపు పార్టీ అభ్యర్థిపై ఎక్కు పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మార్చుకుంటే పార్టీకి చేసేదే లేదని కరాకండిగా తేల్చి చెప్పిన అసమ్మతి గళం.. అభ్యర్థికి బీఫామ్ అందడంతో ఇక పూర్తిస్థాయి రాజకీయానికి సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే అసమ్మతి గళం వినిపించిన కొందరు నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరారు

మండల కేంద్రాలపై కాంగ్రెస్ ఫోకస్

సాగర్ నియోజకవర్గంలోని మండల కేంద్రాలపై కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ పెంచింది. ప్రతి మండల కేంద్రంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ కార్యకర్తలలో భరోసా కల్పిస్తుంది. దీనితో పాటు ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో పెద్ద ఎత్తున చేర్చుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ అసమ్మతి నేతలు కాంగ్రెస్ నేతల టచ్ లోకి వెళ్లినట్టు చర్చ సాగుతుంది. మండల కేంద్రాలలో జరుతున్న రాజకీయ వేడి గ్రామాల మీద పడే విధంగా చూసుకుంటున్నారు. గ్రామాలలో యువతే టార్గెట్ గా రాజకీయం కొనసాగుతుంది. ఇప్పటికే గుర్రంపోడు, హాలియా, పెద్దవూర, తిరుమలగిరి (సాగర్), నిడ్మనూర్ బీఆర్ఎస్ అసమ్మతి నేతలు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలలో చేరారు. బీఆర్ఎస్‌లోని మరో వర్గం అధినాయకత్వం సూచించిన ఎట్టి పరిస్థితులలో సహకరించడం కష్టంగానే ఉందన్న సంకెతాలు వెలువడుతున్నాయి ఫుల్‌జోష్‌లో కాంగ్రెస్

కాంగ్రెస్ యువ నాయకుడు కుందూరు జైవీర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఫుల్‌జోష్‌లో కనిపిస్తుంది. పాత కొత్త తరం నాయకులను సమన్వయపరుస్తూనే.. ప్రతి గడపకు కాంగ్రెస్ మెనిఫెస్టో ప్రజలకు చేరువయ్యేలా యువతను ప్రోత్సహిస్తున్నారు. శుక్రవారం తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో 10000 మందితో సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో గిరిజన తండాలు ఎక్కువగా ఉండడంతో గిరిజన ఓటు బ్యాంకు తమవైపు మరలేలా ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం. ఎర్ర చెరువు తండా ఉపసర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో 200 గిరిజన కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ ఆధ్వర్యంలో 40 మంది హమాలి కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతి గిరిజన తండా నుంచి 600 మంది గిరిజనులను సమావేశానికి తరలించారు.

Read More..

పువ్వాడ Vs తుమ్మల.. హీటెక్కిన ఖమ్మం పాలిటిక్స్..!

Next Story

Most Viewed