గ్రూప్ - 1 పరీక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిర్వహించిందో హైకోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది: మాజీ ఎమ్మెల్సీ కవిత

by Malleboina Mahesh |

ఈ సంవత్సరం మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలతో పాటు మెరిట్ లిస్టును సైతం టీజీపీఎస్సీ విడుదల చేసింది

గ్రూప్ - 1 పరీక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిర్వహించిందో హైకోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది: మాజీ ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ సంవత్సరం మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) గ్రూప్-1 పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలతో పాటు మెరిట్ లిస్టు (Merit list)ను సైతం టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. అయితే ఈ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జారిగాయని, ఒకే కేంద్రంలో పరీక్షలు రాసిన అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆరోపిస్తూ.. కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు.. జనరల్ మెరిట్ లిస్టున్ రద్దు చేసింది. అలాగే 8 నెలల్లోపు రీవాల్యూయేషన్ చేయాలని, అది సాధ్యం కాకపోతే పరీక్షలను తిరిగి నిర్వహించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు (High Court orders TGPSC) ఇచ్చింది.

కాగా నిన్న కోర్టు ఇచ్చిన తీర్పుపై జాగృతి అధ్యక్షురాలు (Jagruti President), మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని లోపాలతో గ్రూప్ - 1 పరీక్షలు నిర్వహించిందో హైకోర్టు తీర్పు (High Court judgment) స్పష్టం చేస్తోంది. గ్రూప్ - 1 మెయిన్స్ ఫలితాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల జీవితాలతో ఎంతగా చెలగాటం ఆడుతుందో గ్రూప్ - 1 ఫలితాలను హైకోర్టు నిలుపుదల చేయడంతోనే రూడీ అయ్యింది. గ్రూప్ - 1 ప్రిలిమ్స్ నుంచి మళ్లీ పరీక్షలు నిర్వహించి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసే జీవో 29 ని రద్దు చేయాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story