Rain Alert for Telangana: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు..!

by Satheesh |   ( Updated:2023-07-04 07:31:55.0  )
Rain Alert for Telangana:  తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో నేటి నుంచి జూలై 6 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఈ వర్షాల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

నేడు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, యాదాద్రి, భద్రాద్రి, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ములుగు, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జూలై 5న పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, జూలై 6న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఓ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story