మోసకారుల లిస్ట్‌లో ఫస్ట్ పేరు ఆయనదే.. ఫిరాయింపులపై పోచారం కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
మోసకారుల లిస్ట్‌లో ఫస్ట్ పేరు ఆయనదే.. ఫిరాయింపులపై పోచారం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీని ఫిరాయింపులు కుదిపేస్తున్నాయి. కేసీఆర్ నమ్ముకున్న కీలక వ్యక్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కారు పార్టీని వదిలి హస్తం పార్టీలోకి వెళ్తున్నారు. ఇక, ఇదే అంశంపై మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం స్పందించారు. బీఆర్ఎస్ నుంచి చెత్త అంతా పోయిందని.. గట్టి వాళ్లే మిగిలారన్నారు. తొలి నుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారన్నారు. పదవులు, వ్యాపారాల కోసం వచ్చిన వారే పార్టీ మారుతున్నారన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్నారు. మోస కారుల జాబితా రాస్తే తొలి పేరు బీబీ పాటిల్ దే ఉంటుందని పోచారం ఫైర్ అయ్యారు. నాయకులను కొటారు గానీ కార్యకర్తలను కొనలేరన్నారు.


Next Story

Most Viewed