ఒక్క ఇటుక పెట్టకముందే రూ.200 కోట్లా?.. సర్కార్‌పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-28 12:53:18  IST  )

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌(Young India Integrated Residential School)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒక్క ఇటుక పెట్టకముందే రూ.200 కోట్లా?.. సర్కార్‌పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌(Young India Integrated Residential School)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. శంకుస్థాపన చేసింది లేదు, తట్టెడు మట్టి ఎత్తింది లేదు, నిర్మాణ వ్యయాన్ని మాత్రం కోట్లకు కోట్లు పెంచడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట వేల కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ ఆడుతున్న మరో నాటకం ఇది’ అని హరీష్ రావు విమర్శించారు.

ఆదిలాబాద్‌‌లో 24.07.2024 రోజున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన మాటలను హరీష్ రావు గుర్తుచేశారు. ‘రూ.80-100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ తర్వాత 11.10.2024 రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.125 కోట్ల వ్యయంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2025 మే రెండో వారంలో రూ.135- 150 కోట్లతో టెండర్లు సైతం ఖరారు చేశారు. మే 27, 2025 నాడు, 20 స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి రూ.4,000 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 96 విడుదల చేశారు. అంటే ఒక్కో స్కూల్ అంచనాలను ఏ పని మొదలు కాకుండానే దాదాపు మూడు రెట్లు, అంటే రూ.200 కోట్లకు పెంచారు. జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ల వరకు అంచనాలను పెంచడం, కమీషన్లు దంచడం. ఇదే కదా కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన?’ అని హరీష్ రావు నెట్టింట సర్కార్‌పై ఘాటు ట్వీట్ పెట్టారు.

Next Story