- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రగడ్డలో చేర్పించాల్సిన బాధ్యత జూబ్లీహిల్స్ ప్రజలదే: హరీష్ రావు
పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వస్తే కుర్చీలు ఖాళీ ఉన్నాయి.. మన మీటింగ్‌కు మూడుసార్లు కుర్చీలు తెప్పించినా సరిపోవడం లేదని సెటైర్ వేశారు. కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్స్‌కు పేరు కేసీఆర్ నగర్ అనే పేరు పెట్టుకున్నాం.. ఇన్ని ఇళ్లు చూసి అబ్బా కేసీఆర్ ఇంత పెద్ద ఇల్లు కట్టాడా? అని ఆశ్చర్య పోయారట. ఇన్ని రోజులు మంత్రులు వచ్చారా? అని అడిగారు. మాగంటి గోపీనాథ్ భార్య కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు చనిపోతే భార్యలు ఏడుస్తారా లేదా? అని ప్రశ్నించారు. ఆ తల్లిని పట్టుకుని దుర్మార్గంగా మాట్లాడారు. ఆలోచన చేయండి.. సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారని అన్నారు.
అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ప్రలోభాలు చేస్తున్నారు. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోతమా? అని అన్నారు. కలలో కూడా కలగనని ఇళ్లలో ఉంటామని అనుకోలేదు.. మీ ఓట్లు ఖాయంగా కేసీఆర్‌కే అని అర్ధం అయ్యింది.. మీ బంధువులకు కూడా చెప్పి కేసీఆర్‌కు కారుకు ఓటేయమ్మని చెప్పండి అని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్పే ధైర్యం లేదు.. మంత్రులు జూపల్లి కృష్ణారావుకు, పొన్నం ప్రభాకర్‌కు జూబ్లీహిల్స్ ఓటర్లు చుక్కలు చూపించారు.. ఓటుకు రూ.3వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. తీసుకుని మిగతా రెండేళ్లలో ఇస్తామన్న డబ్బులు కూడా అడగండని చెప్పారు. రూ.2,500 లేదు, మహాలక్ష్మి స్కీమ్ లేదు, తులం బంగారం లేదు, స్కూటీ లేదు.. సిగ్గు లేకుండా మళ్ళీ ఏదో చేస్తా అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడని విమర్శించారు. తులం బంగారం అడిగితే ఓ నేత లక్ష దాటింది ఎక్కడ ఇస్తాం అని మాట్లాడుతున్నాడు. మరి అలాంటప్పుడు హామీ ఎందుకు ఇచ్చారని సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ చేసిన అభివృద్ది కనపడటం లేదంటే.. ఆయన అంధుడు అయినా ఉండాలే.. లేదంటే పిచ్చోడు అయినా అయి ఉండాలి. పిచ్చోడు అయితే జూబ్లీహిల్స్ ప్రజలు ఎర్రగడ్డలో చేర్చాలని సూచించారు. హిందూ అయినా ముస్లిం అయినా కేసీఆర్‌కు ఒక్కటేనని అన్నారు. ట్వీట్






