- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉంది: మంత్రి ఉత్తమ్
శ్రీశైలం జలాశయం నుంచి గత రెండు వారాలుగా వస్తున్న వరద కారణంగా నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ నిండిపోయింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు గేట్లను ఎత్తేందుకు ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జలాశయం నుంచి గత రెండు వారాలుగా వస్తున్న వరద కారణంగా నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నిండిపోయింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు గేట్లను ఎత్తేందుకు ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర మంత్రలు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్, సాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలతో కలిసి కృష్ణమ్మకు పూజ నిర్వహించారు. అనంతరం మంత్రులు 13, 14 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం అధికారులు 8 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి 68 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే గేట్లను ఎత్తిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందిని అన్నారు. సాగర్ ప్రాంతం ఒక ఆధునిక దేవాలయం అని, ఈ డ్యామ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే మహత్తర కార్యక్రమం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read More: Congress: మంత్రి ఉత్తమ్ పై అలిగి వెళ్లిపోయిన కోమటిరెడ్డి.. బేగంపేట ఎయిర్ పోర్టులో ఘటన






