జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు డెడ్ లైన్.. అప్పటిలోగా విధుల్లో చేరకపోతే సర్వీస్ రిమూవ్!

by Disha Web Desk 19 |
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు డెడ్ లైన్.. అప్పటిలోగా విధుల్లో చేరకపోతే సర్వీస్ రిమూవ్!
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చేస్తోన్న సమ్మెపై సర్కార్ సీరియస్ అయ్యింది. సోమవారం మంత్రి ఎర్రబెల్లి సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జేపీఎస్‌ల సమ్మె వ్యవహారంలో కఠినంగా ఉండాలని.. రేపటిలోగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరకపోతే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. సమ్మే చేస్తోన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు చివరి అవకాశం ఇస్తున్నామని.. రేపు ( మే 9) సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమ్మెచేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులను విధుల నుండి తొలగిస్తామని ఈ నోటీసుల్లో ఆదేశించారు.



Next Story

Most Viewed