మేడారం అభివృద్ధి పనులపై వేగం పెంచిన ప్ర‌భుత్వం

by Ajay Maddhiboyina |

మేడారం సమ్మక్కసారలమ్మ జాతరకు సంబంధించి చేపట్టిన మేడారం అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌భుత్వం వేగం పెంచింది. మంగ‌ళ వారం సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రణాళికను ఖరారు చేయగా, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మేడారం అభివృద్ధి పనులపై వేగం పెంచిన ప్ర‌భుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడారం సమ్మక్కసారలమ్మ జాతరకు సంబంధించి చేపట్టిన మేడారం అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌భుత్వం వేగం పెంచింది. మంగ‌ళ వారం సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రణాళికను ఖరారు చేయగా, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, వరంగ‌ల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచ‌న‌ల‌తో సచివాలయం నుంచి మంత్రి సీతక్క, వ‌రంగ‌ల్ నుంచి మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్, పంచాయతీ రాజ్ ఈఎన్సీ ఎన్. ఆశోక్, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు.

సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ, మేడారం అభివృద్ధి ప్రణాళిక సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడంతో కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది ఒక మహాఘట్టం. ఈ చరిత్రాత్మక పనిలో మీరు అందరూ భాగమవుతున్నారు. ఈ కృషి శాశ్వతంగా నిలుస్తుందన్నారు. మేడారం కీర్తి వెయ్యేళ్లు నిలిచేలా అభివృద్ధి పనులు ఉండాలని, భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ప‌నులు చేప‌ట్టాల‌ని అని మంత్రులు స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యాల కోసం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే మేడారం అభివృద్ది ప్ర‌ణాళిక‌ల‌కు సంబంధించి వర్కింగ్ డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డిజైన్స్‌ను అత్యంత వేగంగా పూర్తి చేయాలని, తదనుగుణంగా పనుల అంచనాలను సిద్ధం చేసి టెండర్లు తక్షణమే పిలవాలని మంత్రులు ఆదేశించారు.

Next Story