పరిశ్రమలరంగంలో పెట్టుబడులు, ఉపాధి అబద్ధం.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

by Dishafeatures2 |
పరిశ్రమలరంగంలో పెట్టుబడులు, ఉపాధి అబద్ధం.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం పరిశ్రమల రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలు కచ్చితంగా ఎందుకు చెప్పలేక పోతున్నారని అంటే అబద్దమా అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది. పరిశ్రమలరంగంలో ఎన్ని పెట్టుబడులు, ఉద్యోగాల కల్పిన జరిగిందో వివరాలు అందజేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కు సోమవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాధరెడ్డి మాట్లాడుతూ.. 2014 నుంచి 2023 జనవరి 2 వరకు టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలశాఖలో 3.3లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, 22.5లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరిగిందని చెబుతుందన్నారు.

పరిశ్రమల స్థాపనతో పాటు ఉద్యోగాల కల్పనపై సమాచార హక్కుచట్టం ద్వారా పరిశ్రమల శాఖ కమిషనర్ ను వివరాలు అడిగినట్లు తెలిపారు. టీఎస్ ఐపాస్ తో 23322 పరిశ్రమలకు అనుమతి ఇవ్వగా, 2.67లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని, 17.82లక్షల ఉద్యోగాల కల్పనకు వీలుందని సమాచారం ఇచ్చారన్నారు. అంటే ఇంతవరకు నికరంగా పెట్టుబడులు, వచ్చిన ఉద్యోగాల వివరాలు చెప్పలేకపోతున్నారని ఆరోపించారు. పరిశ్రమలశాఖ రాని పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చినట్లు చూపుతూ ప్రజలకు లేనిపోని ఆశలు కల్పిస్తున్నట్లు అనుమానం కలుగుతుందన్నారు. ఇప్పటికైనా పరిశ్రమలశాఖ మంత్రి, ఆశాఖ కార్యదర్శి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన వివరాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యోగాల కల్పన అభూతకల్పనే అవుతుందన్నారు.

Next Story

Most Viewed