‘నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలి’.. మీనాక్షికి జగ్గారెడ్డి స్పెషల్ రిక్వెస్ట్

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా జరిగిన మెదక్ లోక్‌సభ(Medak Parliament) స్థాయి సమీక్షా సమావేశం హాట్ హాట్‌గా జరిగింది.

‘నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలి’.. మీనాక్షికి జగ్గారెడ్డి స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా జరిగిన మెదక్ లోక్‌సభ(Medak Parliament) స్థాయి సమీక్షా సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) వార్నింగ్ ఇవ్వడం పక్కన బెడితే.. ఈ సమావేశంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో మాట్లాడాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy)కి మైక్ ఇవ్వగా, మాట్లాడేందుకు నిరాకరించారు. మీనాక్షి నటరాజన్‌తో తాను పర్సనల్‌గా మాట్లాడాలని.. ఆమెకు చాలా విషయాలు చెప్పాలని అన్నారు. తనకు కాస్త సమయం ఇవ్వాలని మీనాక్షి నటరాజన్‌ను జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

అనంతరం మళ్లీ మీనాక్షి మాట్లాడుతూ.. ఈ మీటింగ్‌కు సంబంధించిన విషయాలు బయట మీడియాతో మాట్లాడొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు మంత్రి దామోదర రాజనరసింహాతో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లా పరిస్థితిపై తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ(Telangana Congress)లో అంతర్గత వివాదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదంటూ హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని ఆమె తెలిపింది. నియోజకవర్గ ఇంఛార్జ్‌లు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఇంఛార్జ్‌ వల్లే సమస్యలు వస్తే.. పదవి నుంచి తొలగిస్తామంటూ హెచ్చరించారు.

Next Story