పంట నష్టానికి పాపాల భైరవుడు కేసీఆరే కారణం! కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 14 |
పంట నష్టానికి పాపాల భైరవుడు కేసీఆరే కారణం! కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు, కృష్ణా బేసిన్‌ ఎండిపోవడానికి, పంటల నిర్వహణను పట్టించుకోకపోవడం వంటి అన్ని పాపాలకు పాపాల భైరవుడు కేసీఆరే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ మేరకు ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో కేసీఆర్‌ చేసిన తప్పుల వల్లనే తెలంగాణ ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఫైర్ అయ్యారు. పంట నష్టానికి రూ.25 వేలు డిమాండ్‌ చేస్తున్న కేసీఆర్‌, ఆయన ప్రభుత్వ హయాంలో ఎంత నష్టంపరిహారం చెల్లించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కరువు, వరదల, నష్టం ప్రకృతిపైన ఆధారపడి ఉన్నదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ కరువు అని కేసీఆర్‌ చెబుతున్నారన్నారు. రూ. 300ల కోట్లు రైతులకు ఇచ్చామని హరీశ్‌రావు చెబుతున్నారని, కానీ పది శాతం కూడా ఇవ్వలేదన్నారు. 2014 నుంచి ఆ మూల, ఈ మూల తప్పితే నష్టపరిహారమే ఇవ్వలేదన్నారు. ‘తైబందీ’ విధానాన్నే కేసీఆర్‌ పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతాంగాన్ని, తెలంగాణను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని మండిపడ్డారు.

Next Story