మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదికకానున్న హైదరాబాద్!

by Disha Web Desk 19 |
మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదికకానున్న హైదరాబాద్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో ఫుట్ బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్-2023 నిర్వహించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ స్కేటింగ్ ముందుకు వచ్చింది. మంగళవారం ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, టర్కీకి చెందిన మెగ్ది సల్మాన్ పౌర్, సహా అధ్యక్షురాలు జహ్రీ అబ్దోలిహారంది హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో భేటీ అయ్యారు. వరల్డ్ కప్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుట్ బాల్ స్కేటింగ్ నిర్వాహణకు అవసరమైన పూర్తి సహకారం అందజేస్తామన్నారు. హైదరాబాద్ సిటీ అనేక క్రీడా అంశాల్లో స్పోర్ట్స్ హబ్‌గా రూపాంతరం చెందుతుందన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్టేడియాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బెవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఫుట్ బాల్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జెల నగేష్, కార్యదర్శి దీపక్ కుమార్ కోశాధికారి ఖాదర్‌లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed