Rain Alert: తెలంగాణ వాసులకు చల్లటి కబురు..ఐదు రోజుల పాటు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-05-06 06:17:45.0  )
Rain Alert: తెలంగాణ వాసులకు చల్లటి కబురు..ఐదు రోజుల పాటు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎండలకు తాళలేకపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. భానుడు భగభగమంటూ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 తర్వాత ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. తీవ్రమైన వేడి, వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. నేడు రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఎల్లుండి భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాద్రాది, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

Next Story