పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌కు ఆర్థిక సహాయం అందజేత..

by Disha Web |
పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌కు ఆర్థిక సహాయం అందజేత..
X

దిశ, కోటగిరి: పోతంగల్ మండల పరిధిలోని హంగర్గా(యం) గ్రామానికి చెందిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కాంచన్ జీవన్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో వెంటి లెటర్‌పై చికిత్స పొందుతున్నాడు. అయితే విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోతంగల్ వివేకానంద యూత్ సభ్యులు, చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, అయ్యప్ప సేవా సమితి, వెంకటరమణ బృందం డాక్టర్ సితాలి రమేష్ బృందం మానవతా ధృక్పథంతో యశోదలో చికిత్స పొందుతున్న జీవన్ కుటుంబ సభ్యులకు రూ.1,07,469 లను ఆర్థిక సహాయంగా అందజేసి ఆయనకు అండగా నిలిచారు. అండగా నిలిచి ఆర్థిక సాయం అందజేసిన వారికి జీవన్ పేరుపేరునా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సాయం అందజేసిన వారిలో సూదాం వెంకటేష్, ఏలియాజర్, సునీల్ కుమార్ ఉన్నారు.Next Story