Kavitha : పసుపు రైతులకు మద్దతు ధర కోసం పోరాటం : కవిత

by Y. Venkata Narasimha Reddy |

పేరుకే గెజిట్ ఇచ్చి పసుపు బోర్డు(Turmeric Board)తో పసుపు రైతులను కేంద్రం(Central Government) మోసం చేస్తుందని..దానికి ఎలాంటి చట్టబద్ధత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)విమర్శించారు.

Kavitha : పసుపు రైతులకు మద్దతు ధర కోసం పోరాటం : కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : పేరుకే గెజిట్ ఇచ్చి పసుపు బోర్డు(Turmeric Board)తో పసుపు రైతులను కేంద్రం(Central Government) మోసం చేస్తుందని..దానికి ఎలాంటి చట్టబద్ధత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)విమర్శించారు. శనివారం నిజామాబాద్ పసుపు మార్కెట్(Nizamabad Turmeric Market)ను సందర్శించి(Visit) పసుసు రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడారు. పసుపు మార్కెట్ కు పంటను తీసుకొచ్చిన రైతులకు ఇక్కడ మద్ధతు ధర దక్కడం లేదని..వ్యాపారులు సిండికెట్ కావడంతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.

కేవలం రూ.8వేల నుంచి 9వేలు మాత్రమే దక్కుతుందని..మద్ధతు ధర రూ.15వేలు అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాహుల్ గాంధీ ఎన్నికల్లో పసుపుకు రూ.12వేలు ఇస్తామని చెప్పినందునా మద్ధతు ధర దక్కని రైతులకు తగ్గిన ధర మొత్తాన్ని బోనస్ గాప్రభుత్వం అందించాలని కోరారు. మొత్తానికి 12వేలు అందించాలన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే పసుపు దిగుమతులపై ఆంక్షలు విధించి తెలంగాణ పసుపు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 1వ తేదీ వరకు 12వేలు అందించకపోతే కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామన్నారు. కేంద్రంపై రూ.15వేలు మద్ధతు ధర కోసం, పార్లమెంటులో బిల్లు పెట్టి పసుపు బోర్డుకు చట్టబద్ధత కోసం, దిగుమతులను తగ్గించడం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

మహాబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని..చంద్రబాబు, రేవంత్ రెడ్డిల ప్రజాభవన్ భేటీ తర్వాతానే చంద్రబాబు బంకచర్ల నుంచి గోదావరి నీళ్లను 200టీఎంసీలను కృష్ణా, పెన్నా బెసిన్ కు అందిస్తామని చెప్పాడని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నందునే తెలంగాణకు అన్యాయం చేసేలా ఏపీ గోదావరి నీళ్లను తరలించుకుపోతుంటే మౌనం వహిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు జుట్టు మోడీ చేతుల్లో ఉందని వారు ఎలా చెబితే రేవంత్ అలా చేస్తారని ఆరోపించారు.

తెలంగాణ నీటి ప్రయోజనాలపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బంకచర్లకు వ్యతిరేకంగా అన్ని వేదికల్లో పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గతంలో ఏపీ జలదోపిడికి వ్యతిరేకంగా కోర్టులలో, కేంద్రంతో పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ వాటా నీళ్లను ఏపీకి ఇవ్వడం ద్వారా చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణను చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు.

మహాబూబ్ నగర్ సభలో కేసీఆర్ మీద, నాపైన మహాబుబ్ నగర్ సమావేశంలో వ్యక్తిగతంగా మాట్లాడి తన స్థాయి దిగజార్చుకున్నాడని..నాపై విమర్శలు చేయవద్ధని సుప్రీంకోర్టు గతంలో చివాట్లు పెట్టినప్పటికి మరోసారి నాపై విజ్ఞత లేకుండా విమర్శలు చేశాడని.. ప్రజలు అన్నీ చూస్తున్నారన్నారు. నేను ఆయనలా మాట్లాడి నా స్థాయిని తగ్గించదలుచుకోవడం లేదన్నారు. నోరుందికదా అని ఎటుపడితే అటు మాట్లాడితే కుదరదన్నారు. సుప్రీం కోర్టు తిట్టిన మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ ఖర్మ అని కవిత ఎద్దేవా చేశారు.

Next Story