కేసీఆర్ చేసిన అవే తప్పులు CM రేవంత్ రిపీట్: ఈటల రాజేందర్

by Disha Web Desk 19 |
కేసీఆర్ చేసిన అవే తప్పులు CM రేవంత్ రిపీట్: ఈటల రాజేందర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని.. ఇతర పార్టీ నాయకులను కొనాలని చూస్తున్నారని విమర్శించారు. చివరకు సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గ్యారెంటీల అమలులో విఫలమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే వృధా అవుతోందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మలో ప్రధాని కాలేరని ఈటల జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించి హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. మోడీ మూడోసారి భారత ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు.



Next Story