TG News : సమాజానికి విద్య, వైద్యం రెండు కళ్ల లాంటివి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Muthe.Rajitha |

విద్య(Education), వైద్యం(Hospitality) సమాజానికి రెండు కళ్ల వంటివని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) వ్యాఖ్యానించారు.

TG News : సమాజానికి విద్య, వైద్యం రెండు కళ్ల లాంటివి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : విద్య(Education), వైద్యం(Hospitality) సమాజానికి రెండు కళ్ల వంటివని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) వ్యాఖ్యానించారు. 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో మొదటి స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు సన్మానం, నగదు బహుమతి, ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి విద్య, వైద్యం రెండు కళ్ల వంటివని, వాటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు 10 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోందని తెలిపారు.

అందులో భాగంగా, మునుగోడు నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ స్కూల్ ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యార్థులకు ఉన్నత విద్యా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ పాఠశాల నిర్మాణం మునుగోడు ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, పేద విద్యార్థులకు మెరుగైన అవకాశాలను కల్పించనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు 20 లక్షల రూపాయల నగదు బహుమతులతో సన్మానించే వినూత్న కార్యక్రమాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేపట్టారు. ఈ సందర్భంగా.. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 62 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 189 విద్యార్థినీ విద్యార్థులను సన్మానించి, ప్రతిభ పురస్కారంతోపాటు నగదు బహుమతిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అందజేశారు.

Next Story