Kavitha Arrest : ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ తరలిస్తున్న ఈడీ అధికారులు

by Disha Web Desk 16 |
Kavitha Arrest : ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ తరలిస్తున్న ఈడీ అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తరలిస్తున్నారు. ఆమె నివాసంలోనే కవితను అరెస్ట్ చేసిన అధికారులు.. శనివారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. కవితను అరెస్ట్ చేసేందుకు ఈ కోర్టు నుంచే అధికారులు వారెంట్ తీసుకొచ్చారు. ఈ మేరకు ఆమెను ఢిల్లీ తరలించనున్నారు. ఈ రాత్రి 8.45 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్న ఫ్లైట్‌లో కవితను తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం కవిత నివాసం నుంచి కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ కవితను విచారిస్తూ వచ్చారు. ఎన్నికలకు ముందే ఆమెను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ విచారించి వదిలిపెట్టారు. తాజాగా ఈడీ అధికారులు హైదరాబాద్ బంజారాహిల్స్ కవిత నివాసానికి వెళ్లారు. 4 గంటల పాటు సోదాలు, విచారణ తర్వాత కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Read More..

MLC కవిత అరెస్ట్.. BRS చీఫ్ కేసీఆర్ ఎక్కడ అని జోరుగా చర్చ..?


Next Story

Most Viewed