దసరా స్పెషల్: జమ్మి చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఇదే!

by Disha Web Desk 2 |
దసరా స్పెషల్: జమ్మి చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగలో భిన్న సంస్కృతులు కనిపిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో పిండి వంటలకు ప్రాధాన్యత ఇస్తారు.. తెలంగాణలో మాంసానికి ప్రయారిటీ ఇస్తారు. కానీ, అందరూ సాయంత్రం తప్పకుండా జమ్మిచెట్టును దర్శించుకుంటారు. ఆ తర్వాత పాలపిట్టను చూస్తారు. అయితే, దసరా రోజున జమ్మి చెట్టును దర్శించుకోవడం చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. పండుగ రోజున జమ్మి చెట్టును పూజించి.. జమ్మి ఆకులను పెద్దలకు పంచి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన వృక్షాల్లో జమ్మి చెట్టు(శమీ వృక్షం) ఒకటని ప్రజలు నమ్ముతారు. శమీ పూజ చేసి లంకపై రాముడు దండెత్తాడని పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞాతవాసం తర్వాత పాండవులు శమీ చెట్టుపై ఉంచిన ఆయుధాలను తీసుకెళ్లి కౌరవులను యుద్ధంలో ఓడిస్తారు. దీంతో దసరా రోజున జమ్మిచెట్టుకు పూజ చేస్తే విజయం తప్పక వరిస్తుందని నమ్ముతారు.



Next Story

Most Viewed