ఇక నుంచి ‘డ్రగ్స్ అండ్ డ్రైవ్’ పరీక్షలు.. పోలీసు శాఖ కీలక నిర్ణయం

by Disha Web Desk 4 |
ఇక నుంచి ‘డ్రగ్స్ అండ్ డ్రైవ్’ పరీక్షలు.. పోలీసు శాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం తాగి వాహనం నడిపే వారిని పట్టుకునేందుకు పోలీసులు డ్రంక్ డ్రైవ్ పరీక్షలు చేయడం గురించి తెలిసిందే. అయితే ఇదే తరహాలో డ్రగ్స్ తీసుకుని వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు గాను గంజాయి, మాదకద్రవ్యాలు వినియోగించే వారిని గుర్తించేందుకు ‘ఎబోన్ యూరిన్ కప్’ యంత్రంతో పరీక్షలు నిర్వహించనున్నారు. టీఎస్ న్యాబ్ ఈ పరీక్షల కిట్‌ను అన్ని పోలీసు స్టేషన్‌లకు సమకూర్చింది. గంజాయి తీసుకున్నట్లు అనుమానం వస్తే వారి యూరిన్‌తో టెస్ట్ నిర్వహిస్తారు. పరికరంలో రెండు ఎర్ర గీతలు వస్తే ‘నెగిటివ్’ ఒక గీత కన్పిస్తే ‘పాజిటివ్’గా పరిగణించనున్నారు. అవసరం అనుకుంటే లోతైన దర్యాప్తు కోసం మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.


Next Story