భైంసా వెళ్లాలంటే వీసా కావాలా? Bandi Sanjay Kumar ఫైర్

by Disha Web Desk |
భైంసా వెళ్లాలంటే వీసా కావాలా? Bandi Sanjay Kumar ఫైర్
X

దిశ, కరీంనగర్: భైంసా వెళ్లాలంటే వీసా కావాలా, అది మన రాష్ట్రంలో లేదా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం అర్థరాత్రి ఆయనను పోలీసులు కరీంనగర్‌లోని ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్రను జయప్రదం చేస్తున్నారన్న కారణంగానే అడ్డుకుంటున్నారన్నారు. వరంగల్‌లో కూడా ఇదే తరహాలో అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నామన్నారు. వారం రోజులుగా భైంసా సభ ఏర్పాట్లను, పాదయాత్ర రూట్ మ్యాప్ ఫైనల్ చేశామని, పోలీసులు కూడా ఈ ఏర్పాట్లు పరిశీలించారన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వస్తున్నాడని ఏర్పాట్లు కూడా పోలీసులు పరిశీలించారన్నారు.

సోమవారం నాడు భైంసాలో నిర్వహించనున్న సభకు బయలు దేరిన తనను జగిత్యాల దాటిన తర్వాత నన్ను అరెస్టు చేశారని సంజయ్ తెలిపారు. భైంసా సెన్సిటివ్ ప్లేస్ ఎలా అవుతుందని,. అనుమతి ఇచ్చినప్పుడు సీఎంకు గుర్తు రాలేదా అని అడిగారు. వారం రోజుల నుంచి సెన్సిటివ్ ప్లేస్ అని గుర్తురాలేదా, భైంసాను కాపాడలేని నీవు ఇంట్లో కూర్చోవాలని సంజయ్ వ్యాఖ్యానించారు. భైంసాను కాపాడలేని దద్దమ్మ సీఎం కేసీఆర్ అని, అక్కడ 12 ఇండ్లను తగలబెడితే ఒక్కరిని కూడా కాపాడలేదని ఫైర్ అయ్యారు. కనీసం వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. నిర్మల్ ప్రజలకు వేయి ఊడలమర్రి గుర్తు వస్తోందని, తెలంగాణలో బీజేపీ మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం శాంతి భద్రతల సమస్యలు సృష్టించి దానిని బీజేపీ పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ నీచమైన పాలనను చూసి ప్రజలు విసుగు చెంది బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కింది స్థాయిలో ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారన్నారు. రేపు 12.30నిమిషాల వరకు వేచి చూస్తామని ప్రకటించారు. అసలు తెలంగాణకు ముఖ్యమంత్రే పెద్ద సమస్యగా మారారన్నారు. దేవుళ్ళను, మహిళలను కించపరిచేలా మాట్లాడే మునావర్ ఫారూఖీకి కూయ్ కూయ్ అనుకుంటూ కాపలా కాశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఏక్ నిరంజన్ పార్టీయేనని, మంత్రులు, ఎమ్మెల్యేలు జారిపోతారన్న భయం వెంటాడుతోందన్నారు. తన పాదయాత్ర విజయవంతం అవుతుందనే కేసీఆర్‌కు భయపడుతున్నాడన్నారు. ఖచ్చితంగా భైంసా నుండే పాదయాత్ర స్టార్ట్ చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Read More...

Bandi Sanjay యాత్ర: నేడు హైకోర్టు తీర్పు


Next Story

Most Viewed