బిగ్ అలర్ట్: దీపావళి రోజున పటాకులు కాల్చుతున్నారా?

by Disha Web Desk 2 |
బిగ్ అలర్ట్: దీపావళి రోజున పటాకులు కాల్చుతున్నారా?
X

దిశ, రాచకొండ: దీపావళి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పిండి వంటలతో పాటు పటాకులు. ఏం చేసినా చేయకపోయినా పిల్లలకు మాత్రం పటాకులు కొనిపెట్టాల్సిందే. అవి వాతావరణానికి హానీ కలిగించేవి అని పిల్లలకు తెలియదు.. పెద్దలు చెబితే వినరు. దీంతో చేసేదేంలేక తప్పక కొనుగోలు చేస్తుంటారు. అయితే, పటాకులు కాల్చే వారికి రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పటాకులు కాల్చడాన్ని నిషేధించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఆంక్షలు నవంబర్ 12 నుంచి 15 వరకు అమలులో ఉంటాయన్నారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చడానికి అవకాశం ఇచ్చారు. పొల్యూషన్ బోర్డు నిబంధనలు, నిర్ణయించిన శబ్ధ కాలుష్యం పరిమితులకు లోబడి పటాకులు కాల్చి దీపావళిని జరుపుకోవాలని సీపీ చౌహన్ విజ్ఞప్తి చేశారు.



Next Story