చేతగానితనం అనుకుంటే అసలు రూపం చూపిస్తాం.. కేటీఆర్‌కు భట్టి వార్నింగ్

by Disha Web Desk 2 |
చేతగానితనం అనుకుంటే అసలు రూపం చూపిస్తాం.. కేటీఆర్‌కు భట్టి వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు సహనంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సహనాన్ని చేతగానితనంగా తీసుకుంటే తామేంటో చూపిస్తామని సీరియస్ కామెంట్స్ చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో కేటీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని అన్నారు. గురువారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవెల్‌ లీడర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మేల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పై కామెంట్స్ చేశారు.


Next Story

Most Viewed