కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి కీలక పిలుపు

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేద వ్యక్తి అకౌంట్లో వేస్తానని మోడీ గొప్పలు పలికాడని, కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదన్నారు. అసలు నల్లధనం వివరాలేవీ బయట పెట్టకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. వచ్చాయా? రాలేదా? తేల్చాల్సిన అవసరం ఉన్నదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తూ మోడీ ముందుకు సాగుతున్నాడన్నారు. దేశ సంపదంతా వాళ్లకే కట్టపెడుతున్నాడన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తీరని లోటన్నారు. జనాభాను విభజించి మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. కానీ కులగణన చేసి సంపదను అధిక శాతం జనాభాకు పంచడమే రాహుల్ ధ్యేయమన్నారు.

కొద్దిమంది తన స్నేహితులు, క్రోనీ క్యాపిటలస్‌కు దేశ సంపదను కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని, లౌకికవాదం, ఈ దేశ సంపదను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారని తెలిపారు. లౌకికవాదం ప్రజాస్వామ్యం ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు మీడియా ముందుకు రావాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. చార్జిషీట్‌లో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి పౌరునికి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ సైన్యం కృషి చేయాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed