తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ ఆ పథకాన్ని తీసుకు వస్తున్న ప్రభుత్వం..

by Disha Web Desk 12 |
తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ ఆ పథకాన్ని తీసుకు వస్తున్న ప్రభుత్వం..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో మహిళల కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఈ పథకాన్ని పట్టించుకొలేన్నాదన్నారు. స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీతో రుణాలు అందించే ఈ ప్రభుత్వ స్కీమ్ ను అతి త్వరలో తిరిగి ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

అలాగే ఈ పథకంతో దాదాపు లక్ష మంది మహిళలకు లాభం చేకూరుతుందని.. దీని ద్వారా మహిళల్లో స్వయం సంపాదిత వృద్ధి కూడా భారీగా పెరుగుతుందన్నారు. దీంతో పాటుగా సింగరేణి లో పనిచేస్తున్న 43 వేల మంది కార్మికులకు రూ. కొట్టి విలువైన ఇన్సూరెన్స్ అందించే కార్యక్రమాన్ని రేపే ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed