రాష్ట్ర వ్యాప్తంగా డీసీఏ విస్తృత తనిఖీలు.. 180 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-10 17:01:44  IST  )

యువతను వ్యసనంగా మార్చే ఔషధాలు, గర్భస్రావ కిట్లు, యాంటీ బయాటిక్ మందుల అనియంత్రిత అమ్మకాలపై కట్టడి చేయడం లక్ష్యంగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.

రాష్ట్ర వ్యాప్తంగా డీసీఏ విస్తృత తనిఖీలు.. 180 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువతను వ్యసనంగా మార్చే ఔషధాలు, గర్భస్రావ కిట్లు, యాంటీ బయాటిక్ మందుల అనియంత్రిత అమ్మకాలపై కట్టడి చేయడం లక్ష్యంగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 180 రిటైల్ మెడికల్ షాపుల్లో పెద్ద ఎత్తున నిబంధనలను ఉల్లంఘనలు గుర్తించారు. షెడ్యూల్-హెచ్, షెడ్యూల్-హెచ్1కింద వచ్చే ప్రిస్క్రిప్షన్ ఔషధాల విక్రయ రికార్డులను అధికారులు పరిశీలించారు. రిజిస్టర్డ్ వైద్యులు ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే ఈ మందులు విక్రయించాల్సి ఉండగా ప్రిస్క్రిప్షన్ రిజిస్టర్ల నిర్వహణ, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండానే ఔషధాలు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. గడువు ముగిసిన మందులు, సరిగా నిల్వ చేయని ఔషధాలు లాంటి అంశాలు బయటపడ్డాయి. ఈ ఉల్లంఘనల ఆధారంగా 180 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ షహనవాజ్ ఖాసిమ్ తెలిపారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్, 1940 మరియు సంబంధిత నియమాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

Next Story