మునుగోడులో టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు? కేసీఆర్‌తో కీలక భేటీ

by Disha Web Desk 4 |
మునుగోడులో టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు? కేసీఆర్‌తో కీలక భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రగతి భవన్ లో శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్ తో సీపీఐ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, మునుగోడు ఉప ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రగతిశీల శక్తులన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ సీనియర్ నేత, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన కొన్ని మున్సిపాల్టీలతో పాటు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇచ్చింది.

రాష్ట్రంలో జరిగిన నాలుగు ఉపఎన్నికల్లో పోటీ దూరంగా ఉంది. నియోజకవర్గ నేతలకే ఏ పార్టీకి ఓటు వేసుకోవాలని సూచించారు. అయితే రాబోయే ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారనున్న నేపథ్యంలో సీపీఐ నేతలు కేసీఆర్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు లో 12సార్లు ఎన్నికలు జరుగగా.. 5 సార్లు సీపీఐ విజయం సాధించింది. పార్టీకి కేడర్ సైతం ఉంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. ఈ తరుణంలోనే ప్రగతిభవన్ లో భేటీ అయి ప్రగతి శీల శక్తులు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అంటే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ప్రకటిస్తున్నట్లేనని స్పష్టమవుతోంది. ఇంకా సీపీఎం పార్టీ నిర్ణయం మాత్రం తీసుకోలేదు.


Next Story

Most Viewed