COVID : రాష్ట్రంలో నేటి నుంచి బూస్టర్ డోస్ పంపిణీ

by Disha Web Desk 4 |
COVID : రాష్ట్రంలో నేటి నుంచి బూస్టర్ డోస్ పంపిణీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టేట్‌లో నేటి నుంచి కొవిడ్ బూస్టర్ డోస్‌ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. బూస్టర్ డోస్‌గా కార్బోవ్యాక్స్ టీకాను వైద్యులు ఇవ్వనున్నారు. 5 లక్షల టీకా డోసులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నట్లు డీహెచ్ జీ. శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో మొదటి రెండు డోసులు, కోవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకాలు వేయించుకున్నావారు బూస్టర్ డోస్ గా కార్బేవ్యాక్స్ తీసుకోవచ్చన్నారు.

Next Story

Most Viewed