‘బీజేపీలో నాపై కుట్ర’.. పార్టీ మార్పుపై ఈటల క్లారిటీ

by Disha Web Desk 13 |
‘బీజేపీలో నాపై కుట్ర’.. పార్టీ మార్పుపై ఈటల క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ మార్పుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని గతంలో చెప్పానని, తన లాంటి నాయకులు పార్టీలు మారితే ప్రజలు క్షమించరని అన్నారు. ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఈటల.. తాను పార్టీని వీడి ఎప్పుడు వెళ్లిపోతానో అని ఎదురు చూసేవాళ్లు మా పార్టీలో కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల ఘర్ వాపసీ అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే, బీజేపీని వీడి మావైపు వస్తారని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ అధికారంలో ఉండగా ప్రధాని మోడీ, అమిత్ షా పై ఎంత అహంకారంతో మాట్లాడారో ఇప్పటికీ కళ్లముందు కదులాడుతోందని.. ప్రజాక్షేత్రంలో ఓడిపోయాక పొత్తులు అంటే ప్రజలు నవ్వుకుంటారన్నారు. నాలుగు ఓట్ల కోసం బీఆర్ఎస్ తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ రెండు చోట్ల ఓటమి తర్వాత ఈటల రాజేందర్ కండువా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం గుప్పుమంటోంది. ఈ క్రమంలో ఇటీవల టీ కాంగ్రెస్ నేతలతో ఓ ఫంక్షన్ లో భేటీ కావడం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి. అయితే ఈ వార్తలను ఈటల ఖండించారు. అయితే తాజాగా బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అనే అంశం తెరమీదకు రావడంతో కేసీఆర్ ను విభేదించి బీఆర్ఎస్ ను వీడిన ఆయన తిరిగి అదే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఈ పరిణామాన్ని ఈటల స్వాగతిస్తారా అనేది చర్చగా మారింది. దీంతో పార్టీ మార్పుపై ఆయన ఎన్ని సార్లు స్పందించినా స్పెక్యులేషన్స్ మాత్రం ఆగడం లేదు.


Next Story

Most Viewed