తెలుగు భాషాభిమానులకు, రచయితలకు శుభవార్త.. తెలుగు పద్యకావ్యాలు / గేయకావ్యాలలో పోటీలు

by Disha Web Desk 13 |
తెలుగు భాషాభిమానులకు, రచయితలకు శుభవార్త.. తెలుగు పద్యకావ్యాలు / గేయకావ్యాలలో పోటీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులకు, రచయితలకు శుభవార్త! ప్రముఖకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సంస్మరణలో ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం అధ్వర్యంలో తెలుగు పద్యకావ్యాలు గేయకావ్యాలలో పోటీలకు ఆహ్వానం పలుకుతున్నారు. 'తానా-సిరివెన్నెల సాహితీపురస్కారం-2023' పేరిట తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో తెలుగు పద్యకావ్యాలు గేయకావ్యాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతకు లక్ష రూపాయల నగదు పురస్కారం అందజేస్తున్నారు. పద్య, గేయ కావ్యాలు అందవలసిన చివరి తేది 2023 మే 31. ఫలితాల ప్రకటనను 2023 జూన్ 30 లోపు వెలువరిస్తారు.

నియమ నిబంధనలు:

అంశం

1. సమకాలీన సామాజికసమస్యలు-పరిష్కారాలు

2. మానవసంబంధాలు-కుటుంబవిలువలు

3. ప్రకృతి-పర్యావరణం

4. యువతరం-భవిష్యత్తు

5. దేశభక్తి-జాతీయవాదం అంశాలలో ఏదైనా ఒక అంశం తీసుకుని పద్యకావ్యం లేదా గేయకావ్యం గాని 60 పేజీలకు (A4సైజులో) మించకుండా ఉండేటట్లుగా రాసి పంపవలసినదిగా కోరారు.

•సరికొత్తగా రాసిన కావ్యాలు మాత్రమే పోటీకి పరిగణింపబడతాయి.

•ఇప్పటికే ముద్రించబడిన, సామాజిక మాధ్యమాలలో, వెబ్ పత్రికలల్లో ప్రచురితమైన రచనలు ఈ పోటీలకు అర్హం కావు.

•కేవలం ఈ పోటీకోసం రాసిన స్వీయరచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. ఆ మేరకు హామీపత్రం జతచేయడం తప్పనిసరి.

•పంపే రచనలతోపాటు మీ ఛాయాచిత్రాన్ని, పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, వాట్స్యాప్ నంబర్, ఇమెయిల్‌ని జతపరచవలెను.

•మీరు రాసిన కావ్యాన్నిస్కాన్ చేసి కానీ, తెలుగులో డి.టి.పి చేసి కానీ పంపించండి.

•డి.టి.పి ప్రతిని ఇమెయిల్ రూపంలో [email protected] కు పంపాలి. వాట్స్యాప్ రూపంలో అయితే +1-972-591-1208 కు పంపాలి

•మాకు అందిన కావ్యాలలో - బహుమతి పొందిన కావ్యాన్ని, మేము ఎంపికచేసిన కొన్నికావ్యాలను ఇ-పుస్తకంగా ప్రచురిస్తాము.

•మీరు పోటీలకు పంపిన కావ్యాలను తిరిగి మీకు పంపడం సాధ్యం కాదు. రచయితలు మూలప్రతిని తమవద్ద ఉంచుకోవడం మంచిది.

•న్యాయనిర్ణేతల ఎంపికపై ఉత్తరప్రత్యుత్తరాలకు అవకాశంలేదు.

•మిగిలిన వివరాలకు తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు– డా. ప్రసాద్ తోటకూరను +1-817-300-4747 లో గాని, లేదా [email protected] ద్వారా గాని సంప్రదించవచ్చును.



Next Story

Most Viewed