హ్యాపీ బర్త్‌డే ఫిదా బ్యూటీ.. నేడు సాయిపల్లవి పుట్టిన రోజు

by Disha Web Desk 8 |
హ్యాపీ బర్త్‌డే ఫిదా బ్యూటీ.. నేడు సాయిపల్లవి పుట్టిన రోజు
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే అంటూ తన డ్యాన్స్‌తో ప్రతి ఒక్కరి మదిలో అందాల యువరాణి గా నిలిచి పోయింది. ఇక ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. అంతే కాకుండా టాలీవుడ్‌లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్‌గా మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి.

అయితే నేడు ఈ అందాల ముద్దుగుమ్మ సాయిపల్లవి పుట్టిన రోజు. ఈ బ్యూటీ 1992లో జన్మించింది. ఆమెది తమిళ కుటుంబం. ఈ బ్యూటీ మాతృభాష బడగ. సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ కూడా సినీ పరిశ్రమలో మెరిసింది. సాయి పల్లవి డాక్టర్ కావాలనుకుంది. అయితే క్రమంగా ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. దాంతో సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది. అంతే కాకుండా ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కూడా ఈమె పార్టిసిపేట్ చేసి రన్నర్‌గా నిలిచింది. ఆ సమయంలోనే ఈ ముద్దుగుమ్మకు నటనపై ఆసక్తి పెరగడంతో సినిమాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సాయిపల్లవి తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది. ఈ బ్యూటీ రొమాంటిక్ సీన్స్‌కు దూరంగా ఉంటుంది. గ్లామర్ పాత్రలు చేయడానికి అంతగా ఇష్టం చూపదు.అందుకే ఈ నటి అంటే చాలా మందికి ఇష్టం. మరీ ముఖ్యం సాయిపల్లవి డ్యాన్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈమె డ్యాన్స్ చేస్తే.. నెమలి నాట్యం చేసినట్లు ఉందని చెబుతుంటారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యూటీకి చైతూ‌తో పాటు పలువురు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.

Read More...

రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు యంగ్ హీరోయిన్ సీరియస్.. మొదట మూవీ గురించి మాట్లాడుకుందాం అంటూ కామెంట్

Next Story

Most Viewed