కేబినెట్ విస్తరణపై CM రేవంత్ రెడ్డి ఫోకస్.. వీరికే ఛాన్స్!

by Disha Web Desk 2 |
కేబినెట్ విస్తరణపై CM రేవంత్ రెడ్డి ఫోకస్.. వీరికే ఛాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇదే విషయమై రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో సీఎం భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే విస్తరణ పూర్తి చేసేలా కసరత్తు ప్రారంభించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు కేబినెట్‌లో చోటు దక్కలేదు.. దీంతో ఆ జిల్లాల వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి రేసులో మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి ఉండగా.. ఆదిలాబాద్ నుంచి పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ ఉన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌తో విస్తరణపై స్పష్టత రానుంది.

కాగా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించాక, గతేడాది డిసెంబరు 9వ తేదీన అధికారం చేపట్టింది. అదేరోజు సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కేబినెట్‌లో బెర్త్ ఖరారు అయిందంటూ వార్తలు వినిపించాయి. కానీ, అనూహ్యంగా చివరి నిమిషంలో ఆయనుకు పార్టీ హ్యాండ్ ఇచ్చింది. విస్తరణలో ఆయనకు తప్పకుండా స్థానం కల్పించాలని పార్టీ శ్రేణులు అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై కేబినెట్ విస్తరణపై ఫోకస్ చేసింది. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed