మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ సమీక్ష.. దూరం, ఖర్చు తగ్గిస్తామని ప్రకటన

by Disha Web Desk 2 |
మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ సమీక్ష.. దూరం, ఖర్చు తగ్గిస్తామని ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో విస్తరణపై రైల్వే అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో మార్గం ప్రణాళికలపై అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎయిర్‌పోర్టుకు మెట్రోను రద్దు చేయటం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్టు తెలిపారు.

శంషాబాద్ విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గించి మెట్రో నిర్మిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీహెచ్‌ఈఎల్​నుంచి ఎయిర్‌పోర్టుకు 32 కిలోమీటర్లు ఉంటుందన్న సీఎం రేవంత్‌.. ఎంజీబీఎస్​ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో ఉంటుందని చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్‌పోర్టుకు వెళ్లే మెట్రో లైన్‌ను లింక్ చేస్తామని వెల్లడించారు.

Next Story

Most Viewed