CM Revanth Reddy : కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..బయట మంటలు!

by Y. Venkata Narasimha Reddy |

తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Cente) సర్వీస్ రోడ్డు(Service road)లో చెలరేగిన మంటలు(Fires)కలకలం(Tension)రేపాయి.

CM Revanth Reddy : కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..బయట మంటలు!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Cente) సర్వీస్ రోడ్డు(Service road)లో చెలరేగిన మంటలు(Fires)కలకలం(Tension)రేపాయి. కమాండ్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఖనిజాభివృద్ధి శాఖ(Mineral Development Department meeting)ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో సర్వీస్ రోడ్డులోని చెట్లలో మంటలు చెలరేగడం టెన్షన్ కు గురిచేసింది.

తెలంగాణ భవన్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సర్వీస్ రోడ్ లో చెత్త అంటుకుని చెట్లు తగలబడగా.. భారీ మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ఉదృతికి దట్టమైన పొగ అలుముకోవడంతో వచ్చి పోయే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, ఫైర్ సిబ్బంది మంటలు విస్తరించకుండా చర్యలు చేపట్టారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఖనిజాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Next Story