పార్లమెంట్ ఇంచార్జ్ లేకుండానే నేతలతో సీఎం రేవంత్ మీటింగ్

by Disha Web Desk 14 |
పార్లమెంట్ ఇంచార్జ్ లేకుండానే నేతలతో సీఎం రేవంత్ మీటింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మల్కాజిగిరి పార్లమెంట్ సీటు హాట్ సీట్‌గా మారింది. బీజేపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈటల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ఇటీవల ప్రకటించారు. ఆయన సైతం ప్రచారానికి సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మల్కాజిగిరి లోక్‌సభ స్థానం కచ్చితంగా గెలువాలని భావిస్తుంది. ఆ స్థానం గత ఎంపీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా గెలిచిన స్థానం. కాబట్టి గెలుపే లక్ష్యంగా అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజిగిరి నియోజవర్గంలో పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఇంచార్జ్ లేకుండా సీఎం రేవంత్ మీటింగ్

గతంలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అదిష్టానం ఇంచార్జీలను నియామించింది. మాల్కాజిగిరి ఇంచార్జీగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియమించింది. కానీ నేడు జరిగిన కాంగ్రెస్ మల్కాజిగిరి నియోజకవర్గం మీటింగ్‌లో మంత్రి తుమ్మల హాజరుకాలేదు. అధిష్టానం ప్రకటించిన ఇంచార్జీ లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ చేపట్టడం టీ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే సునీతా మహేందర్ రెడ్డి మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ మీటింగ్‌లో సునీతా మహేందర్ రెడ్డి హాజరుకావడం.. మంత్రి తుమ్మల రాకపోవడంతో పార్టీ వర్గాల్లో అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి.

Next Story

Most Viewed