నర్సంపేటకు సీఎం కేసీఆర్.. హెలిప్యాడ్ సిద్ధం!

by Disha Web Desk 2 |
నర్సంపేటకు సీఎం కేసీఆర్.. హెలిప్యాడ్ సిద్ధం!
X

దిశ, నర్సంపేట: అకాల వడగండ్ల వానతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. నర్సంపేట నియోజకవర్గంలో వందల ఎకరాల్లో పంట నష్టం చోటుచేసుకుంది. ఇది గడచి నేటికి ఏడాది దాటిందో లేదో ప్రకృతి మరోసారి రైతన్నపై పగ పట్టింది. ఈ క్రమంలో మరోమారు వరుణుడు వడగండ్లతో రైతులకు తీరని నష్టం చేశాడు. ఈ నేపథ్యంలో గతేడాది పంట నష్టానికి సంబంధించిన చెక్కుల పంపిణీని మంగళవారం మధ్యాహ్నం చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా నర్సంపేట పట్టణంలోని మార్కెట్ స్థలంలో హెలిప్యాడ్ సిద్ధం చేస్తుండటం చర్చకు తెరలేపింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ స్వయానా పంట నష్టానికి సంబంధించి పంటల పరిశీలనకు వస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్నది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకున్నా పట్టణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

2022 లో కురిసిన అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీకి తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు/ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వస్తున్నట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కాగా బుధ, గురువారం నాడు సీఎం పర్యటన ఉండే అవకాశం ఉందని, చెక్కుల పంపిణీ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వివరాలు వెల్లడించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read:

మరికాసేపట్లో కరీంనగర్‌కు సీఎం కేసీఆర్?



Next Story