అసెంబ్లీ సాక్షిగా.. RTC అమ్మకంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
అసెంబ్లీ సాక్షిగా.. RTC అమ్మకంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విద్యుత్ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో సోమవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. సోమవారం అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడారు. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని అసహనం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్‌తో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను లాక్కున్నారని అన్నారు. సీలేరు పవర్ ప్లాంట్‌నూ లాక్కున్నారని, ఆ సమయంలో ప్రధానిని వ్యతిరేకించిన వాడిని తానొక్కడినే అని తెలిపారు. మోస్ట్ ఫాసిస్ట్ అని ప్రధానిని ఆనాడే అన్నట్లు గుర్తుచేశారు. ఎదుటివాళ్లు చెబితే వినే సంస్కారం బీజేపీ నేతలను లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర బిల్లును ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎలా సమర్థిస్తారో ఆయనే ఆలోచించుకోవాలని సూచించారు. ఆర్టీసీని అమ్మేయాలని లెటర్లు వస్తున్నాయని, అమ్మితే వెయ్యి కోట్ల బహుమతి ఇస్తామంటున్నారని కేసీఆర్ తెలిపారు.

Also Read: ఇలా ప్రశ్నిస్తే కేసీఆర్ భయపడడా?



Next Story

Most Viewed