మాంస ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు?

by velandi.Saikiran |

రెండు తెలుగు రాష్ట్రాల మాంస ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. ఎండాకాలం ముదురుతున్న నేపథ్యంలో... చికెన్ ధరలు (

మాంస ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు?
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల మాంస ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. ఎండాకాలం ముదురుతున్న నేపథ్యంలో... చికెన్ ధరలు ( Chicken prices ) క్రమక్రమంగా పెరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ ( Bird flu) లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలుతున్నప్పటికీ కూడా... చికెన్ ( Chicken ) తినేందుకు మాంస ప్రియులు ఎగబడుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ( Telangana) అలాగే ఆంధ్రప్రదేశ్ లో ( Andhra Pradesh State )... చికెన్ వినియోగం విపరీతంగా పెరుగుతోందని చెబుతున్నారు వ్యాపారస్తులు.

దీంతో క్రమక్రమంగా... చికెన్ ధరలు పెరుగుతున్నాయి. తెలంగాణలో ( Telangana) ప్రస్తుతం కేజీ చికెన్ ధర 250 రూపాయల నుంచి 270 రూపాయల వరకు కొనసాగుతోంది. కొన్నిచోట్ల 280 రూపాయలకు కూడా కిలో చికెన్ అమ్ముతున్నారు. అయితే గత రెండు వారాల కిందట పరిస్థితి వేరేలా ఉండేది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కిలో చికెన్ ధర 230 రూపాయల వరకు మాత్రమే ఉండేది.

కానీ వినియోగం పెరగడంతో... ధరలు క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh State ) కిలో చికెన్ ధర 300 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర కొనసాగుతోంది. ఎండాకాలం ముదిరిన నేపథ్యంలో కోళ్ల సంఖ్య కూడా తగ్గుతుంది. వడ దెబ్బకు చాలా కోళ్లు మరణిస్తున్నాయి. ఈ నేపథ్యం లో కోళ్ల సంఖ్య తగ్గడం వినియోగం పెరగడంతో కూడా ధరలు పెరుగుతున్నాయి. వర్ష కాలం వచ్చే వరకు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు వ్యాపార్థులు.

Next Story