మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై చైర్మన్ ఛలోక్తి..

by Disha Web Desk 5 |
మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై చైర్మన్ ఛలోక్తి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో శాసనసభ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం గుప్పించుకుంటున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం నడుమ రాజకీయం సీరియస్ గా నుడుస్తున్న వేళ మండలిలో సరదా సన్నివేశం వెలుగుచూసింది. ఇవ్వాళ శాసన మండలి సమావేశం సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన టి. జీవన్ రెడ్డిపై చలోక్తులు విసిరారు. సమావేశం మొదలయ్యే సందర్భంలో మండలిలో కాంగ్రెస్ సభ్యులు కూర్చునే వైపు ఖాళీగా కనిపించడంతో.. జీవన్ రెడ్డి గారు కూడా ఇటు చేరిపోయారా ఏంటీ, అంతా ఖాళీగా ఉంది అటూ నవ్వు చిందించడంతో సభ్యులంతా ఒక్కసారిగా నవ్వులు పూయించారు. దీంతో శాసనమండలిలో కాసేపు సరదా వాతవరణం కనిపించింది.

Next Story