'అదానీ కంపెనీల గోల్ మాల్‌పై కేంద్రం సమాధానం చెప్పాలి'

by Disha Web Desk 2 |
అదానీ కంపెనీల గోల్ మాల్‌పై కేంద్రం సమాధానం చెప్పాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఎఫెక్ట్ తో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఢమాల్ అంటున్నాయి. గ్రూప్ లో పలు కంపెనీల షేర్లు పతనం కావడంతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ అంశంపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కేంద్రాన్ని టార్గెట్ చేసుకుంటున్నాయి. తాజాగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆదానీ గ్రూప్ లో అవకతవకలపై వార్తలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అంతర్జాతీయ నివేదికలపై ప్రతి భారతీయుడి సందేహాలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సెబీతో పాటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు సర్వత్రా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.


Next Story

Most Viewed