- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెక్లెస్ రోడ్డులో జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ.. హాజరు కానున్న పార్టీ కీలక నేత
జమ్మూ కాశ్మీర్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలియజేసేందుకు జనసేన పార్టీ (Janasen Party) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు జరపాలని పార్టీ అదిష్టానం నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలియజేసేందుకు జనసేన పార్టీ (Janasen Party) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు జరపాలని పార్టీ అదిష్టానం నిర్ణయించింది. ఇందులో పార్టీ కార్యాలయాలపై జెండా అవతనం, కొవ్వొత్తుల ర్యాలీ, మానవ హారాలు నిర్వహించాలని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఆదేశించారు.
ఇందులో భాగంగా జనసేన ఎమ్మెల్సీ నాగాబాబు (Janasena MLC Nagababu) బుధవారం సాయంత్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ (Hyderabad)లోని నెక్లెస్ రోడ్డు (Necklace Road)లో జరుగుతున్న ర్యాలీలో పాల్గొంటారు. జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ.. కొవ్వొత్తులు వెలిగించి మృతులకు సంతాపం తెలియజేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన కార్యకర్తలు (Telangana Janasena Activists), అభిమానులు పెద్దఎత్తున పాల్గొనాలని పార్టీ ప్రకటన విడుదల చేసింది. అంతేగాక జనసేన కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరై కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్ (Nemuri Shankar Goud) పిలుపునిచ్చారు.






