గద్దరన్న అంతిమయాత్రను ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదు.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్

by Dishafeatures2 |
RS Praveen Kumar
X

దిశ, వెబ్ డెస్క్: గద్దర్ అంతిమయాత్రను ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ గారి పార్థివదేహాన్ని చివరి చూపు చూసేందుకు వచ్చిన ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగిందని అన్నారు. చాలా సార్లు తొక్కిసలాట జరిగి సరిగ్గా గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇంతటి గొప్ప ప్రజాగాయకునికి తెలంగాణ ప్రభుత్వం ఇంత అయిష్టంగా అరకొర బందోబస్తు ఇస్తే ఎట్లా అని ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు చనిపోతే రాత్రి తొమ్మిదిన్నరకు అధికార లాంఛనాల ప్రకటన చేస్తారా అని నిలదీశారు.

ఎంతో మంది మహిళలు, మేధావులు, సీనియర్ సిటీజన్లు చివరి చూపుగా గద్దరన్నను చూడడానికి వచ్చారని, వాళ్ల కేమైనా అయితే ఎలా అని అన్నారు. కనీసం దారి పొడవునా తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయవచ్చు కదా అని చెప్పారు. లక్షల మంది పాల్గొన్న ఈ యాత్రలో ఎక్కడా అంబులెన్సులు కన్పించలేదని, సీఎం కాన్వాయ్ కి మాత్రమే అంబులెన్సు సౌకర్యం ఉంటే సరిపోతుందా అని నిలదీశారు.

Next Story

Most Viewed