బీఆర్ఎస్ కీలక సమావేశం వాయిదా

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ కీలక సమావేశం వాయిదా

బీఆర్ఎస్ కీలక సమావేశం వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీన నిర్వహించాల్సిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కోసం ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొననున్నారని తెలిపారు.

Next Story