బీఆర్ఎస్‌లో MP అభ్యర్థులు కరువయ్యారు: రఘునందన్ రావు

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌లో MP అభ్యర్థులు కరువయ్యారు: రఘునందన్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌లో ఎంపీ అభ్యర్థులు కరువయ్యారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పేరు మీద అక్రమంగా వేల కోట్లు సంపాదించిన వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారని విమర్శించారు. కేవలం సూట్‌కేసులు మోసేవాళ్లకే బీఆర్ఎస్‌లో పదవులు ఉంటాయని అన్నారు. మెదక్ జిల్లాకు కేసీఆర్ ఏనాడైనా వచ్చారా? అని ప్రశ్నించారు. మెదక్ ఈ సారి కమలం జెండా ఎరగడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు. 370 పైచిలుకు స్థానాల్లో జెండా పాతి కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కాబోతోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక మొత్తం కనుమరుగు కావడం ఖాయమన్నారు.

Next Story

Most Viewed