‘ఎందుకు, ఏమిటి, ఎలా అని ఈడీ ప్రశ్నిస్తే.. తెలీదు, గుర్తులేదు అని చెప్పిందట’

by Disha Web Desk 2 |
‘ఎందుకు, ఏమిటి, ఎలా అని ఈడీ ప్రశ్నిస్తే.. తెలీదు, గుర్తులేదు అని చెప్పిందట’
X

దిశ, వెబ్‌డెస్క్: ఈడీ అధికారుల విచారణలో ఎమ్మెల్సీ కవిత తప్పుడు సమాధానాలిస్తే మరింత త్వరగా జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే వారికి సహకరించి అన్నీ నిజాలే చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం జరిగిన కవిత ఈడీ విచారణ సందర్భంగా మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చిందని ఆయన చెప్పారు. కేసీఆర్ కుటుంబంపై బీఆర్ఎస్ నేతలకు ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ అభివృద్ది, తెలంగాణ మహిళ గౌరవాన్ని పెంచడంపై ఉంటే బాగుండేదని చురకలంటించారు. మెడికో విద్యార్ధి ప్రీతి మృతిపై ఎందుకు వీరంతా స్పందించలేదని ఆయన నిలదీశారు. రాష్ట్ర అడ్మనిస్ట్రేటివ్, మంత్రులు.. తెలంగాణను వదిలిపెట్టి మరీ ఢిల్లీకి వచ్చారని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఈడీ విచారణలో కవిత వారికి ఎలాంటి సమధానాలు చెప్పలేదని తమకు సమాచారం అందిందని అర్వింద్ అన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు ఏమో, తెలియదు, గుర్తులేదు అనే ఆన్సర్ ఇచ్చారని ఆయన ఎద్దేవాచేశారు. ఇలాంటి తప్పుడు సమాధానాలు ఇస్తే త్వరగా కవిత అరెస్టు ఖాయమన్నారు.

తెలంగాణ సొమ్ము దోచుకోవడం పూర్తవ్వగానే ఢిల్లీ ప్రజల సొమ్ము దోచుకున్నారన్నారు. కవితకు లక్షల రూపాయల వాచీలు, కోట్ల రూపాయల కమ్మలు ఎక్కడివని అర్వింద్ ప్రశ్నించారు. సీఎం కేసీఅర్, మంత్రి కేటీఆర్ అవినీతి అందరికీ తెలుసని ఆయన పేర్రకొన్నారు. కవిత నిజంగానే తప్పు చేయకుంటే బీఆర్ఎస్ నేతలు ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నట్లని అర్వింద్ ప్రశ్నించారు. దుర్మార్గుల చేతుల కలిపి నిజాయితీ పరుడైన మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు జైలుకి పోయాడని గుర్తుచేశారు. రాజకీయాల్లో అంటరాని కుటుంబం ఏదైనా ఉందంటే అది కల్వకుంట్ల కుటుంబమేనని అర్వింద్ ఘాటు విమర్శలు చేశారు. కవిత తప్పు చేయకుంటే 16న విచారణకు రావాలని, తప్పు చేయలేదని తేలితే నిజాయితీగా బయటకి వస్తారు కదా అని ఆయన అన్నారు. కేసీఆర్, కవిత ఒత్తిడి వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళాడని అర్వింద్ అన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానున్నట్లు చెప్పారు. వీటన్నింటి కంటే ముఖ్యమంత్రి కేసీఆర తన పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడం ఉత్తమమని అర్వింద్ సూచించారు.


Next Story

Most Viewed